10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

జాబిలి

పల్లవి ; జాబిలి వెన్నెలలో
           ఈ రాతిరి జాతరలో
            అందాలే అగుపించాలి
           బంధాలై చిగురించాలి
చరణం ;పాలరాతి బొమ్మా నీ పైట తొలగిన వేళ
            చందమామ బొమ్మా నీ రవిక చేరిన వేళ
             ఏది తళుకో ఏది మలుపో
             నీలో నేను నాలో నీవు ప్రవహించాలి
             ఏకంగానే చీకటి తలపు పలికించాలి || జాభిలి ||
చరణం ;లేత బాపు బొమ్మా ..నీ బుగ్గ కందిన వేళ
             వెన్నెలమ్మ కిరణం నీ వెన్ను మెరిసిన వేళ
             ఏమి పలుకో ఏమి వలపో
             ఏమి కులుకో ఏమి తలపో
             నాతో నీవు నీతో నేను నిడురించాలి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

html enable