6, అక్టోబర్ 2012, శనివారం

ananda geetham

నాలో ఊపిరి నీవై 
నా గుండె చప్పుడుకు తోడై 
నీ భావాలే 
ఆహ్లాదపరుస్తున్నాయి 
ప్రియా !
ప్రతి రేయీ వెన్నెల రాత్రయి 
తనువులు రెండూ ఒకటై 
ఆనంద గీతాన్ని 
ఆలపిస్తుంటే 
నక్షత్రాలు సైతం 
నవ్వుకొన్నాయి !!!







joke

రైల్వే స్టేషన్ లో టైం టేబుల్ చూస్తూ "రాజేష్ !రైళ్లన్నీ లేట్ గా నడుస్తున్నప్పుడు ఈ టైం టేబుల్ ఎందుకు ?"విసుక్కొంటూ అడిగాడు శంకర్
"ఏ ఏ రైలు ఎంత లేట్ గా నడుస్తుందో తెలుసుకోవడానికి "సాలోచనగా అన్నాడు రాజేష్ .

1, అక్టోబర్ 2012, సోమవారం

joke

:మీ ఆ విడ అంటే మీకంత ప్రేమ కదా !ఆవిడ చనిపోయాక మీకెలా అనిపించింది ?:"ప్రశ్నిం చాడు గణేష్ .
"చాలా భాదేసింది .ఆ బాధ తట్టుకోలేక మరో పెళ్లి చేసుకున్నా .నా భార్యంటే నా కంత ప్రేమ ."జవాబు చెప్పాడు ప్రణీత్ 

joke

నరేంద్ర ;భార్యంటే నీకంత ప్రేమా ?
ప్రకాష్ ;అవును .చచ్చేంత ప్రేమ .
నరేంద్ర ;ఎవరు చచ్చేంత ?
ప్రకాష్ ;నేనే .సరే గానీ మరి నీకు ?
నరేంద్ర ;నాకూ ప్రేమే .మొన్న లవ్ లెటర్ రాస్తే నా బార్యకి చెబుతానని బెదిరిచింది నీ భార్య .

joke

"జలుబుకి ఇన్ని మందులు రాసి ఇచ్చారు .ఇన్ని అవసరమా ?"భయపడుతూ అడిగాడు గోవిందయ్య .
"జలుబే గదాని అశ్రద్ధ చేస్తే అది ఫ్లూ జ్వరం కావచ్చు .లేదా ఎయిడ్స్ కావచ్చు .లేదా కాన్సెర్ కి దారి తీయ వచ్చు ."
అంటూ చెప్పుకు పోతున్న డాక్టర్ గారితో "ఆగండాగండి .ఇక్కడ ఎవరయినా మంచి డాక్టర్ ఉంటె చెప్పి పుణ్యం కట్టుకుంటారా ప్లీజ్ "గాబరా పడ్డాడు గోవిందయ్య .