22, సెప్టెంబర్ 2012, శనివారం

thodu

అవును
నిజమే
తీయని జ్ఞాపకాలు నిన్ను
వెంటాడా లి .
కమ్మని కోయిల స్వరాలూ
నీ మదిని పులకింప జీయాలి
పండు వెన్నెలలు ,ఆరు బయట
గడిపిన వెచ్చని రాత్రులు
నిన్ను ఉక్కిరి బిక్కిరి చేయాలి
కన్నీటి తెరలను పక్కకు నెట్టి
సంతోష సాగరంలో నీవు తడిసి
కేరింతలు కొట్టాలి .
అందుకు నీకొక నేస్తం కావాలి
నీ బ్రతుకుకి ఒక తోడు కావాలి 

odaarpu

కళ్ళలోని నీరు తొలగడానికి
మాటల యుద్ధం పనికిరాదు
గుండెలోని దిగులు పోవడానికి
కుట్రలూ కుతంత్రాలూ పనికిరావు
ఓదార్పు నిచ్చే రెండు కళ్ళు
ప్రేమని పంచె రెండు చేతులు
పరిష్కారం చూపే ఒక నేస్తం
ప్రతి ఒక్కరికీ కావాలి
అపుడే
లోకమంతా రంగుల మయంగా
కనిపిస్తుంది
ఆవేదనంతా ఆనందంగా
మారుతుంది !!!

20, సెప్టెంబర్ 2012, గురువారం

chiru navvu

ఆత్మ విశ్వాసాన్ని
నర నరా ల లోనూ నిలుపుకొంటే
వృద్దాప్యంలో సైతం
బాల్యం చిగురిస్తుంది

చిరు నవ్వును
ఎదుటి మనిషికి  పంచ గలిగితే
సమస్యల వలయం మాయమై
అనందం వెల్లి విరుస్తుంది !!!

18, సెప్టెంబర్ 2012, మంగళవారం

namaskaaram

తెలుగు బ్లాగర్స్ కు ,కవులకు ,కళాకారులకు ,మేధావులకు ,అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు .

17, సెప్టెంబర్ 2012, సోమవారం

jnapakam

చేజారిన జ్ఞాపకాలను
మనసులో నాటుకొని
వలపు నీటిని జల్లి
పెంచి పెద్ద చేస్తే
అందమైన నీ రూపం
కళ్ళ ముందు ప్రత్యక్ష మైనది
ప్రియా !
జన్మ జన్మ లకీ
నిన్ను నా మనసు నుండి
ఎవరూ చేరపలేరు !!!