పల్లవి ;ఎదలో ఒక గానం
రేపినది ఎవరో
మదిలో ఒక వెలుగు
పరచినది ఎవరో
చరణం ;ఈ చల్లని వేళలో
ఏ పిలుపు వినిపించునో
ఈ వెన్నెల రాతిరీ
ఏ తాలుకు కనిపించునో
ఏటిని అడిగా
నీ ఒడి చేరను
నీ మది దోచను //ఎదలో //
చరణం ;ఈ కన్నుల కొలనులో
ఏ రూపు నిడురించునో
ఈ మనస్సు మాటున
ఏ నవ్వు మురిపించునో
గాలిని అడిగా
నేలను అడిగా
నీ దరి చేరను
నా మనసేయను //ఎదలో //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable