పల్లవి ;హృదయంలో నీ ధ్యానం
ప్రతి క్షణమూ పలుకుతోంది
ఆదరంలో నీ ముద్దు
ప్రతి నిముషం మెరుస్తోంది
చరణం ;ఆనాటి తలపులు ఈనాడు
చినుకులుగా కురిసెను
ఈనాటి వలపులు ముద్దులై
చిగురులుగా మొలచెను //హృదయంలో //
చరణం ;ఏనాటి కలలో కరిగీ ...
ధారలుగా వేలేసెను
వెలిగిన కనులే విరిసీ ...
నీ రూపం నిలిచెను //హృదయంలో //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable