12, అక్టోబర్ 2012, శుక్రవారం

విజయం

విజయం
చెలిమి కడితే చాలు 
పరిష్కారం నీ దరి చేరు 
ఆ శ  తొడిగితే చాలు 
ఉన్నత శిఖరాలు చేరు 
ప్రేమ పొంగితే చాలు 
కోప తాపాలు చల్లారు 
విశ్వాసం  ఉంటె చాలు
విజయాలు వెంట చేరు

9, అక్టోబర్ 2012, మంగళవారం

నీ కోసం

ఒంటరిగా 
తుంటరిగా 
నీ కోసం 
కవ్వింత లతో 
కేరింతలతో 
నీ కోసం 
చేమంతులతో 
పూ బంతులతో 
నీ కోసం 
ప్రేమ శి ఖ రపు  అంచున 
ఒంటరి పక్షి నై 
నే నెగురుతుంటే 
మేఘం ఆవల 
నీ రాగాలు లీలగా విని పిస్తుంటే 
కాలాన్ని మరచి 
గాయాలని తుడిచి 
నీ కోసం నిరీక్షిస్తూనే వుంటాను !!!