పల్లవి ;ఆకాశ దేశాన హరివిల్లు విరిసింది
శ్రావణమేఘాలు రాగాలు పలికాయి
చరణాలు చినుకులై బువి మీద దుమికాయి
పాటలే వరదలుగా ఎదలోన పారాయి
చరణం ;కన్నీటిని తుడుచుచూ పన్నీటిని చల్లుతూ
ఆశల్ని రేపేగా ఆనందం పంచేగా
హృదయాన్ని మీటుతూ ఆదరాన్ని అదుముతూ
సిందూరం దిద్దేగా శుభలేఖలు పంచేగా //ఆకాశ //
అనురాగం పంచుతూ అందాలలో ముంచుతూ
రాగాలెవో నాలో ప్రవహించెను; ఈనాడే
ప్రేమో ఏమో గానీ హాయి నొందే ఈప్రాణం //ఆకాశ //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
html enable