30, అక్టోబర్ 2010, శనివారం

వెన్నెల రాతిరి

పల్లవి ; వెన్నెల రాతిరిలో నీ కోసం వెతికాను
కన్నుల వెలుతురులో నీ కోసం చూసాను
ఏ గాలి వీచెనో ఈ మనసు వేచేను
ఏ పైట తగిలేనో ఈ రేయి రగిలెను
నీ రూపమే నా ధ్యేయము
ఈ ప్రేమ నంధనములోనే తిరగాలి ........
చరణం ; హృదయాన్ని నడిపించే పరువాల వయసేది
బంధాన్ని పెనవేసే వయ్యారి వలపేది
కోకిల రాగమా నా భావం నేరమా
మమతల గానమా ఈ మదిని చేరుమా
కన్నుల గూటిలో ప్రతి నిత్యం స్వప్నం చిగురిస్తుంది
వయసు గోడులో అను నిత్యం నిన్నే తడుముతూ వుంది
ఈ విరహ భాద నీకే తెలుపాలి ........... వెన్నెల
చరణం ; మేఘాన విరిసేటి విరజాజి పూవేది
లోలోన విరిసేటి పున్నమి కలువేది
గుండె చాటు మొహమా తలపుల్లో తాపమా
ప్రేమ లోని పాసమా నా ఎదలోని కోశమా
పలుకు పలుకు ప్రతి రోజు బంధం పెనవేస్తుంది
పదము పదము ప్రతి నిమిషం అనుబంధం సృష్టిస్తుంది
ఈప్రేమపాటం నీకే వినిపించాలి ........... వెన్నెల

ఆశ

పల్లవి ;శ్వాసనై చేరనా నీ మనసులో
ఆశవై సాగవా నా వయసులో
మెరుపునై నిలవనా నీ సొగసులో
మమతవై మొలవవా నా కనులలో
చరణం ;నీ రూపము తలచినా
నా మనసులో మోహాలే
నీ భావము మెదిలినా
నా హృదిలో రాగాలే
ఏదో నిరీక్షణ నీ కోసమే
ఏదో ఆలాపన నీ భావమే శ్వాసనై
చరణం ;నీ మనసును వలచినా
నా బతుకున వెలుగులే
నీ ధ్యానము చేసినా
నాకు మోక్షము కలుగులే
ఏవో తపనలు నీకోసమే
ఏవో చిగురులు నీ ఆశలే శ్వాసనై