7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

raktham

రక్తం ధార బోస్తే
న్యాయం బైటకు వస్తుంది
ఊపిరి ధారబోస్తే
ధర్మం ఊపందు కొంటుంది ?!!
దైర్యం అడుగు ముందుకేస్తే
అసత్యం తోక ముడుచుకొంటుంది
వ్యక్తి లోనైనా
దేశపటము లో నైన
ఉడుకు రక్తం ప్రవహిస్తే
స్వాతంత్ర్యపు జెండా
రెప రెప లాడుతుంది 

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

love

ఒక పూవును ప్రేమించడం కన్నా
ఒక చెట్టును ప్రేమించడం మిన్న
ఒక నీటి బొట్టును ప్రేమించడం కన్నా
ఒక సముద్రాన్ని ప్రేమించడం మిన్న
ఒక జాతిని  ప్రేమించడం కన్నా
మానవత్వాన్ని ప్రేమించడం మిన్న
ఒక భూమిని ప్రేమించడం కన్నా
విశ్వాన్ని ప్రేమించడం మిన్న 

manasu

పల్లవి ;మనసు తడిసే మనువు తెలిపే
          వయసు ఎగసే  కలలు ఎగసే
         నా లోపల ....లోలోపల
చరణం ;చల చల్లగా నాలో
            మెలమెల్లగా నీవే
            ఏవో గుసగుసలు చేసావే
           ఎదలో గిలిగింతలు పెట్టవే                  ||మనసు ||
చరణం ;కనుచూపుల్లో నీవే
            పెళ్లి కూతురివై రావే
            ఏవో సయ్యాటలు ఆడావే
           వలపు చిగురులు రేపావే                   ||మనసు ||

3, సెప్టెంబర్ 2012, సోమవారం

kavikulam

దేవుని చేత
మనుషుల చేత
మోసగింప బడ్డ వాళ్ళం

కాలం చేత
గాలం చేత
గాయ పడ్డ వాళ్ళం

కాసేపు వాస్తవానికి దూరంగా
మరి కాసేపు
వర్తమానానికి దగ్గరగా
జీవించే వాళ్ళం

అవినీతికి ,అరాచకత్వానికి ఆవల
సంఘా లను నిర్మించు కొని
ఆనందించే వాళ్ళం

మేమంతా కవులం
సమాజ నిర్మాణానికి కారకులం .