24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

గగన సౌందర్యం

విశ్వ నేత్రం విచ్చుకున్నప్పుడు
పచ్చదనం కప్పుకున్న నేల
పరిమళాలు వెదజల్లుతూ
నాట్యం చేస్తుంది
ఆకాశాన్ని దాచుకున్న సాగరగర్భం
నీలపు అద్దమై మెరుస్తుంటుంది
ఇంద్ర దనువుపై
నిలచిన జల బిందువులు
గగన సౌందర్యాన్ని ఆవిస్కరిస్తుంటాయి
ప్రకృతి ధరించిన
మంచు కిరణాలను తొలగిస్తూ
నేలను ఆక్రమించే ఎండ
ఆకాశం విసిరేసిన సుందర దృశ్యాన్ని
రెప్పల వాకిళ్ళు మూసి
కనులలో దాచుకోవాలే గాని
నూరేళ్ళ జీవితం ఆనందాన్ని
పులుముకోదూ ?!

ఉమ్మడిరాగాలు

వసంతాల నీడలో
వలపుల పూలు పరచి
చల్లగాలిని పిలచి
జ్ఞాపకాల పుటలను
తిరగేస్తుంటే .....
ప్రియా!
ఆనాడు నీ మోమును చూసి
జాబిలి చిన్నబోయింది
నీ నవ్వును చూసి
వెన్నెల మూగబోయింది
కాలంలో విరబూసిన
మన సజీవ కొనాల మధ్య
అధిరోహించిన
సమున్నత శిఖ రాల పైన
ఉమ్మడి రాగాలు ఆలపిద్దాం .

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

వెన్నల సఖి

ఎన్ని కడలి సాయంత్రాలు
ఎన్ని గగన విహారాలు
మనిద్దరి మధ్యా
ఓ వెన్నల సఖి !
నీ చూపుల తీగలు
నా శూన్య నేత్రాలలో
ఇంద్ర ధనుస్సులా
ఆవిష్కరించ బడినపుడు
ఆ క్షణాలు మౌ నాన్ని పులుము కొని
వెన్నల జ్ఞాపకాల మధ్య
మన ప్రతిబింబాలను చిత్రీకరిస్తాయి
కడలి తీరపు ఇసుక తిన్నెలపై
విహరించిన మన పాద ముద్రలలో
సప్తవర్ణ పుష్పాలే
కాంతులీను తుంటాయి .

19, సెప్టెంబర్ 2010, ఆదివారం

premageetham

ప్రేమగీతం

ప్రియసఖి !

నీ సజీవ శిల్ప సౌందర్య వర్ణాలలో

నేను ఇంద్రధనుస్సునై ప్రవేశించి

ఆశాజ్యోతి నిరంతరం ప్రజ్వరిల్లడానికి

మధుర స్వప్న తైలబిందువులుగా మారి

హృదయ జ్వాలతో

నీ మనసును వెలిగిస్తా