15, జనవరి 2012, ఆదివారం

పల్లవి ;గోగు పూచే గువ్వా కూసే
          రేగుపండ్లు  నెల కురిసే
          కొలను లోకి చిలుక వచ్చే
         నీరు మారే పన్నీరాయే
చరణం ;చెట్టు పైని కోకిలలే పాటలూ పాడగా
            నీటిలోని తమరాలే సిగ్గుతో విరియంగా
           ఒద్దు మీద చీర తీస్తే చందురుడు నవ్వే లోన
           మేను తడిసే లోలోన వెన్నెలే ఎదపైన                            //గోగు పూచే //
చరణం ;స్నానమాయే చినదానికి చీరలే కరువాయెనే
            ఒడ్డుపైన నడకాయేనే వెన్నెలే చీరాయేనే
            వేడుకోవే నేలరాజునే ఏలుకొను ఈ రాతిరి
           చుట్టుకోవే రారాజుని చీరల్లె చినవాడిని                          //గోగు పూచే //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

html enable