15, జనవరి 2012, ఆదివారం

పల్లవి ;వయసు ముదిరితే ప్రేమ
          మనసు చెదిరితే ప్రేమ
          కనులు నవ్వితే ప్రేమ
          పెదవి కందితే ప్రేమ
చరణం ;నవ్వు లోనే మల్లె పుట్టే
            మల్లె కాడ తీగ పుట్టే
            తీగ పాకి మొగ్గ లేచే
            మొగ్గ విరిసి పూవు పూచే
            కొప్పులోన పూవు దాగే
            పువ్వు నవ్వి నన్ను కోరే                               //   వయసు //
చరణం ;ముద్దు నిచ్చి నీకు నేను
            ప్రేమ పంచి మేలు చేస్తే
            మనసు నలుపు తెలిసి నాకు
            మోస పోతి బ్రాంతి పోయే
             కళ్ళలోన కడలి  నిలిచే
            గుండె పగిలి లావా ఎగసే                              //వయసు //
పల్లవి ;కడలి పైన అలల రావే
           ఇసుక లోని గుర్తు లీవె
           మేను తడిపే ముద్దు నీవే
           మమత లోలికే గట్టు నేనే
చరణం ;కల కల రావలలు మురిసినవి
            జల జల ఝరులు పారినవి
           తల తల మెరుపులు ఎగసినవి
           గణ గణ మనసులు  మోగినవి                                    //  కడలి //
చరణం ;తొలకరి తలపులు కురిసినవి
            తరగల పరుగులు తాకినవి
            వరదల ప్రేమలు నిండినవి
            మార్పుల మరులు మొలచినవి                                //కడలి //
            
పల్లవి ;కొనలోన  దాగినావు
          కోన సీమ వెదకినాను
          కోరి వస్తి కోమలాంగి
          చేరి నిన్ను చేదుకొందు
చరణం ;నారికేళ పాకమల్లె
            తీయ నైన లేత చనులు
            ఎదురు చూస్తూ ఉన్నవేమో
           వాటికున్న అమృత దరులు                                    //కొనలోన //
చరణం ;నల్లనైన మేఘ మల్లె
            చల్లనైన నీదు కనులు
            తవ్వి చూస్తే తెలుసునేమో
            వాటిలోని వలపు గనులు                                     //కొనలోన //
శుభాకాంక్షలు
తెలుగు సాహితీ మిత్రులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు
సమస్యల వలయం
సమస్యలు సమస్యలు
దేశమంతా సమస్యలు
యువరాజుకు పెళ్లి సమస్య
యువ నేతకు ఓదార్పు సమస్య
కెసిఆర్ కు తెలంగాణ సమస్య
కిరణ్ అన్నకు భాషా సమస్య
చిరుకు విలీనం సమస్య
బాబుకు అధికారం సమస్య
ప్రజలకు ఆకలి సమస్య
స మస్యలు సమస్యలు
దేశమంతా సమస్యలు

30, అక్టోబర్ 2010, శనివారం

వెన్నెల రాతిరి

పల్లవి ; వెన్నెల రాతిరిలో నీ కోసం వెతికాను
కన్నుల వెలుతురులో నీ కోసం చూసాను
ఏ గాలి వీచెనో ఈ మనసు వేచేను
ఏ పైట తగిలేనో ఈ రేయి రగిలెను
నీ రూపమే నా ధ్యేయము
ఈ ప్రేమ నంధనములోనే తిరగాలి ........
చరణం ; హృదయాన్ని నడిపించే పరువాల వయసేది
బంధాన్ని పెనవేసే వయ్యారి వలపేది
కోకిల రాగమా నా భావం నేరమా
మమతల గానమా ఈ మదిని చేరుమా
కన్నుల గూటిలో ప్రతి నిత్యం స్వప్నం చిగురిస్తుంది
వయసు గోడులో అను నిత్యం నిన్నే తడుముతూ వుంది
ఈ విరహ భాద నీకే తెలుపాలి ........... వెన్నెల
చరణం ; మేఘాన విరిసేటి విరజాజి పూవేది
లోలోన విరిసేటి పున్నమి కలువేది
గుండె చాటు మొహమా తలపుల్లో తాపమా
ప్రేమ లోని పాసమా నా ఎదలోని కోశమా
పలుకు పలుకు ప్రతి రోజు బంధం పెనవేస్తుంది
పదము పదము ప్రతి నిమిషం అనుబంధం సృష్టిస్తుంది
ఈప్రేమపాటం నీకే వినిపించాలి ........... వెన్నెల

ఆశ

పల్లవి ;శ్వాసనై చేరనా నీ మనసులో
ఆశవై సాగవా నా వయసులో
మెరుపునై నిలవనా నీ సొగసులో
మమతవై మొలవవా నా కనులలో
చరణం ;నీ రూపము తలచినా
నా మనసులో మోహాలే
నీ భావము మెదిలినా
నా హృదిలో రాగాలే
ఏదో నిరీక్షణ నీ కోసమే
ఏదో ఆలాపన నీ భావమే శ్వాసనై
చరణం ;నీ మనసును వలచినా
నా బతుకున వెలుగులే
నీ ధ్యానము చేసినా
నాకు మోక్షము కలుగులే
ఏవో తపనలు నీకోసమే
ఏవో చిగురులు నీ ఆశలే శ్వాసనై