12, ఫిబ్రవరి 2012, ఆదివారం

song

పల్లవి ;చిరుగాలి తాకెనమ్మ కలలో నేడే 
         అది నీవని తెలిపెనమ్మా మనసే ఇపుడే 
        ఆశల జల్లును కుమ్మరించనా జీవితంలో 
       ప్రేమపు బాటలు సాగదీయనా చూపులతో 
 చరణం ;మెరుపుల తళుకు దనం మేనుకు అద్దనా 
            కులుకుల హంసతనం నడుముకు నేర్పనా 
           తెగవు నీవుగా గాలిని నేనుగా 
          ఈ క్షణమే ఊయలూగి 
          ఈ బతుకే తరువులాగా ఎదగాలి                         //చిరుగాలి //
చరణం ;చిగురుల పచ్చదనం బతుకున పూయనా 
           కొమ్మల ఓంపుతనం ఒంటికి చుట్టనా 
           పూవువు నీవుగా పరిమళం నేనుగా 
           ఈ యుగమున నిలిచి నిలిచి 
          మన ప్రేమ పచ్చపచ్చగా ఎదగాలి                      //చిరుగాలి //


1 కామెంట్‌:

html enable