28, ఫిబ్రవరి 2012, మంగళవారం

పల్లవి  ;చెంతచేర రావే చిన్ని గోపిక 
            ఏనాటిదో ఈ చిన్ని కోరిక 
            గోపాలుడై వేణు ఊదగా
           గోపికవై వెన్న ముద్ద తేవే ..........
చరణం ;గోధూళి వేళ గోరువంక కూయగా 
            గోరంత గోముగా గోచిరించ రావా 
           కనులలో నీ కమనీయ చిత్రం కనుమరుగాయేనే
           ఒక సారి నా దరి చేరి ఎదలో తల దాచుకోవా         //చెంత //
చరణం ;నడిరాత్రి వేళ నర్తకివై నడయాడ 
            నడుముకు రాతిరి తీరిక ఉండదుగా 
            చీకటిలో నీ చిరు నవ్వులు చిందులాడునే
             రేపటికి ఇద్దరికీ మధ్యాహ్నం సూర్యోదయమే!!!           //చెంత //

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

html enable