8, డిసెంబర్ 2012, శనివారం

కథ

కథ 
ఇక ఊరిలో ఒక రాజు ఉండే వాడు .అతనికి ముగ్గురు కుమారులు .రావన్ ,ఆల్బర్ట్ ,పీటర్  వారి పేర్లు.ఒక రోజు ముగ్గురు పిల్లలు ఆడు కొంటున్నారు.రాత్రయింది.చలి మంట వేసుకొన్నారు.మంట రావన్ కి అంటూ కొండి.రావన్ పెద్దగా కేకలు పెడుతున్నాడు.మిగిలిన ఇద్దరు పరుగెత్తుకొని వెళ్లి రాజు కి చెప్పారు.
         రాజు హుటాహుటిన అక్కడకు చేరు కొన్నాడు .అప్పటికే రావన్ సగం కాలి పోయాడు.రాజు తనతో ఉన్న దుప్పట్లును రావన్ కు కప్పాడు.తర్వాత వైద్యుని దగ్గరకు పంపించాడు.రావన్ కు రెండు కళ్ళు పోయాయి.కానీ ప్రాణం దక్కింది.
          తన బిడ్డకు కళ్ళు తెప్పించిన వారికి రాజు సగం రాజ్యాన్ని ఇస్తానని ప్రకటించాడు .ఏ వైద్యుడు నయం చేయలేక పోయాడు .కానీ మంత్రి ఒక సలహా ఇచ్చాడు .కాకులు దూరని కారడవి ,చీమలు దూరని చిట్టడవి లో ఒక మూలిక దొరుకు తుందని ,అది తెచ్చి,దాని రసం కళ్ళకు పూసిన చూపు వస్తుందని చెప్పాడు.
           దీనికి ఎవరూ ముందుకు రాలేదు.చివరికి రాజు అడవికి వెళ్ళాడు .మూలికను సంపాదించాడు .తఃన బిడ్డకు చూపు ను ప్రసాదించాడు.
                                                                                                  పల్లపు కృష్ణ వంశి 
                                                                                                  5 వ తరగతి 
                                                                                                   సెయింట్ పాల్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ 
                                                                                                   పద్మా వతి సెంటర్ 
                                                                                                    నెల్లూరు -4

24, నవంబర్ 2012, శనివారం

మనసు పరిమళం

మనసు పరిమళం
మనసులో అంధకారం
బ్రతుకుకి అవరోధం
మనో వైకల్యం -మనిషికి ఒక దౌర్భాల్యం
చిట్టి మనసు గాయ పడితే
పెద్ద తనువు తల్లదిల్లిపోదూ ...
ఈర్ష్య ,ద్వేషం ,అసూయ ,హింస ....
దుర్గుణా లతో ఆవరించిన మనసు
కష్టాల పాలై క్షీణిస్తుంది
సత్యం ,ధర్మం ,త్యాగం ,సహనం ......
సద్గుణా లతో ఆవరించిన మనసు
సుఖ శాంతులతో శోబిస్తుంది
అందుకే ఓ మనిషీ !!
ఆత్మ విశ్వాసమనిడి ఖడ్గం చేత పట్టు
అరి శద్వార్గాల ను తెగ నరుకు
ఇంద్రియాలనేడి అశ్వాల తాళ్ళను చేత పట్టు
భుద్ది యనెడి రధాన్ని ముందుకు నడిపించు
అపుడే
విజయం నీ కాళ్ళ ముందు వాలుతుంది
మనో వైకల్యం ఆమడ దూరం పరుగెడు తుంది
నీ మనసుకు పరిమళం అద్దు కొని
విజయం వైపు నువ్వు నడువ్
నీ వెనక ప్రపంచం నడుస్తుంది !!

23, నవంబర్ 2012, శుక్రవారం

ఊహా సుందరి

ఊహా సుందరి 
రాతిరి కలత నిదురలో 
వెచ్చని భావాలను 
మదిలో కప్పుకొని 
ఊహల దారాలతో 
నిను అల్లుకొని  
కలవరిస్తుంటే 
ఆనందం నన్ను ఆక్రమించింది 
ఒక్కసారిగా 
నా శరీరంలో నిస్సత్తువ !!?

11, నవంబర్ 2012, ఆదివారం

బతుకు నేర్పని చదువులు

బతుకు నేర్పని చదువులు 
నేడు పరీక్షలలో మార్కులు బాగా వస్తే చాలు .విద్యార్ధి అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తాడనే ఆశలు తల్లిదండ్రు లలో బాగా ఉన్నాయి.జీవితంలో బతకడానికి అవసరమైన సామర్ద్యాలు ను సాదిం చేలా నేటి సిలబస్ లేదనేది కటోర సత్యం.దీనికి సాక్ష్యం నేడు సమాజం లో జరుగుతున్న పరిణామాలే అని చెప్పవచ్చు .విద్య నేర్చుకొనే వయసులో పిల్లలు మనో బావాలు దెబ్బతినడం ,బావోద్యోగాలను అదుపులో పెట్టుకోలేక జీవితాన్ని నాశనం చేసుకోవడం ప్రతి రోజూ పేపర్లో చూస్తూనే ఉన్నాము.వారి ప్రవర్తన పెద్దల పాలిత శాపంగా పరిణమిస్తోంది .
                              సినిమాలు ,సేరియల్లు ,ఇంటర్నెట్ ప్రదానంగా విద్యార్ధుల జీవితాలను ప్రబావితం చేస్తున్నాయి .పేస్ బుక్ ని ఉపయోగించుకొని  ఒక మరగుజ్జు మనిషి ఇక అమ్మాయిని ఎంత మోసం చేసాడో ఈమద్య్హ వెలుగులోకి వచ్చింది .దగ్గరి మనుష్యులు తోనే స్నేహం ప్రమాదకరంగా మారిన సమాజంలో ఎక్కడో వున్న వ్యక్తులతో ఆన్ లైన్ లో సంభా సించి ప్రేమించడం ఎంత మూర్కత్వం .
                                   మన విద్యా వ్యవస్థ లో కనీసం నైతిక విలువలు పెంచే విలువలు సిలబుస్ లో చేర్చక పోవడం దారుణం.అంతే కాదు .తల్లి దండ్రులుకు  విద్యర్థుల రోజు వారీ కార్యక్రమాలను తెలుసుకొని వారిని సక్రమ మార్గంలో పెట్టె తీరిక లేకుండా పోయింది . క్రమశిక్షణ ,నైతిక స్థైర్యం ,ఆరోగ్య కరమైన అలవాట్లను చెప్పే  తల్లి దండ్రులు ,గురువులు నేడు కొరత అయిపోయారు .
                                 ఈ సమస్యలు పరిష్కరించు కో కుంటే బావి సమాజం అంధకారంలో పడిపోతోంది.      
తల్లి దండ్రులు ,మేధావులు,గురువులు ,రచయితలు ,కవులు ,సామాజిక వేత్తలు ,సినిమా డైరెక్టర్ లూ ,అందరూ భాద్యతతో వ్యవహ రించవలసిన సమయం ఆసన్న మైనది .జ్ఞానేంద్రియాల వికాసం ,పరిసరాల విజ్ఞానం ,నిర్దిష్ట నైపుణ్యం ,ఉపాది ,సామాజిక వికాస భాద్యత ,విశిష్ట వ్యక్తిత్వ నిర్మాణం,మార్గదర్శక సామర్ధ్యం పెంపు దలలె చదువుల పరమార్ధం కావాలి .     

6, నవంబర్ 2012, మంగళవారం

మరణం వైపు పయనం

మరణం వైపు పయనం 
ఆహా ..
ఏమీ  జీవితం ?
ధరణి రంగస్థలంపై 
ఎంత మంది నటీ నటులు 
భార్యని భర్త 
భర్తని భార్య 
తల్లిని కూతురు కూతుర్ని తండ్రి 
గురువును శిష్యుడు 
శిష్యుడను గురువు 
ఎంత అవల్లీలగా 
మోసం చేసు కొంటున్నారు 
ఆహా ఏమీ జీవితం?
పుట్టుక నుండి 
వేషాలు వేసి రాటు దేలిన 
నటీ నటులు .......
ఆహా ఏమీ జీవితం 
దేవుడి దగ్గర అవార్డులు కొట్టేస్తూ 
జీవుల దగ్గర రివార్డులు పొందేస్తూ 
ఒక సారి  ప్జోంగి పోతూ 
మరో సారి కుంగి పోతూ 
నలిగి పోతున్న జీవితాలు 
మరణం వరకూ సాగే 
పాత్రల సన్నివేశాలూ .......
ఆహా ఏమీ జీవితం ???

26, అక్టోబర్ 2012, శుక్రవారం

జీవ వైవిద్యం

జీవ వైవిద్యం 
పసుపు ధనమై పోతున్న పచ్చ దనం 
ప్రస్తుత జీవ వైవిద్యం 
నేడు అంతరిస్తున్న జీవ రాసులు 
మనిషి వికృత చేష్టలకు ప్రతి రూపాలు 
అభివృద్ధి పేరుతో సాంకేతిక ప్రయోగాలు 
అంతరిస్తున్న హరిత వనాలు 
అనేక వ్యాధులకు జీవం పోసి 
విత్తనాలపై పెత్తనం చెలాయించి 
అడవి తల్లిని హతమారుస్తూ 
కడలికి కస్టాలు కలిగిస్తూ 
జీవరాసులని మత్తు బెట్టె 
ఓ మనిషీ !!
ఒక్క విషయం గమనించావా ?
భూమిపై ఒక జీవి 
అంతరించ భోతోంది .
ఆ జీవి ఏమిటో తెలుసుకోవాలని ఉందా 
అయితే 
అద్దం ముందుకు వెళ్లి చూడు !?

16, అక్టోబర్ 2012, మంగళవారం

దొంగ బాబాలు

దొంగ బాబాలు
బ్రహం గారు చెప్పినట్లు నేడు ఊరికొక స్వామీజీ పుట్టుకొస్తున్నాడు .కొన్ని సంస్కృత శ్లోకాలూ నేర్చుకొని సందర్బాను సారంగా వాటిని వివరించడం ,అమాయక ప్రజలను ఆకర్షించడం వీళ్ళ పని .కార్పోరేట్ ఆశ్రమాలను నిర్మిస్తూ రాజకీయ నాయకులను కూడా త్ర్హమా గుప్పిట్లో పెట్టుకొంటున్నారు .
                     ఈ ఆశ్రమాల వెనక ఎన్ని చీకటి కార్యక్రమాలు జరుగుతున్నాయో అందరికి తెలిసిన విషయమే .రియల్ ఎస్టేట్ వ్యాపారులకు .బడా బాబులకు కావాల్సిన సరుకు అంతా ఇక్కడ నుండే సరపరా అవుతూ వుంది  అనే విషయం అప్పుడప్పుడూ మనం పేపర్ల లోనూ ,టివి చానళ్లలోనూ చూస్తూనే వున్నాం .
                        పాపం ఎంతో మంది మానసిక రోగులూ ,శారీరక భాదలు గలవారూ తమ వ్యాధులు నయం కాక ఆశ్రామాలకు వస్తూ వుంటారు .వారిలో అందమైన అమ్మాయిలను స్వామీజీ తమ భక్తి తో ,రక్తి కట్టిస్తూ వుంటారు !!!
వారికి మత్తు పదార్ధాలను ఇవ్వడం ,తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడం ఎంతో దారుణం.దేవుడి పేరు చెప్పి ఇన్ని రకాల చీకటి పనులు చేస్తూ వుంటే ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదః ర్శిస్తోంది .
                        ఆశ్రమాల వెనక స్మగ్లింగ్ ,హై టెక్ వ్యభిచారం ,బంగారం ,డబ్బు మారకం విచ్చల విడిగా జరుగు తున్దనేది బహిరంగ రహస్యమే .చిత్రమేమిటంటే భారతీయ ఆధ్యాత్మిక సంపధకు మురిసి పోయి విదేశీయులు సైతం 
ఈ ఆశ్రమాల బారిన పడి నష్ట పోవడం మనం చూస్తూనే వున్నాము .
                       కంచే చేను మేస్తే చందంగా వీటిని ఎవరు కాపు కాస్తూ వున్నారో మనకు తెలిసిన విషయమే .ప్జ్రజలు కూడా వీటిని వ్యతిరేకించాలి .స్వచంద సంస్థలు ,సాంఘిక సేవా కార్య కర్తలు .....అందరూ కలసి ఆశ్ర మాలలో జరిగే ఘోరాలను నిలదీయాలి .వాటిని ఆపాలి .అమ్మయక భక్తులకు నిజమైన జ్ఞాన భోధ చేసి ,వారిని శాస్త్రీయ దృక్పధం వైపు నడిపించాలి .మూడ నమ్మకాలపై యుద్ధం చేయాలి .జై విజ్ఞాన్ అన్న అటల్ భిహారి వాజపేయి నినాదాన్ని నిజం చేయాలి .నిజ మైన భారతీయ ఆద్యాత్మిక సమాజాన్ని సృష్టించాలి .
                         నిజమైన గురువులను పూజించాలి .ఒక క్రీస్తు ,ఒక మహ్మద్ ప్రవక్త ,ఒక  సాయి ,ఒక బ్రహ్మం గారు ,ఒక వెంకయ్య స్వామి ,ఒక రామకృష పరమ హంస ,ఒక వివేకానందుడు  లాంటి వారిని స్ఫూర్తి గా తీసి కోవాలి వారి సూక్తులను ఆచరించాలి .ఆత్మా సాక్షాత్కారానికై సాధన చేయాలి .అంతే గాని అరిషడ్వ ర్గము లకు లోనై ,మత్తు పదార్ధాలకు బానిసలై ,ప్రజల సొమ్మును దోచుకు తినే బాబాల వద్దకు వెల్ల కూడదు .మనలను మనం మోసం చేసుకో కూడదు .
                               all power is within you 
                              you can do anything  and everything అన్న వివేక నందుని సూక్తిని మరువ కూడదు .మానవత్వాన్ని  ఈ దరణి పై నిలిపి ,అందరూ సుఖ సంతోషాలతో జీవించడానికి కృషి చేయాలి .