నేడు పరీక్షలలో మార్కులు బాగా వస్తే చాలు .విద్యార్ధి అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తాడనే ఆశలు తల్లిదండ్రు లలో బాగా ఉన్నాయి.జీవితంలో బతకడానికి అవసరమైన సామర్ద్యాలు ను సాదిం చేలా నేటి సిలబస్ లేదనేది కటోర సత్యం.దీనికి సాక్ష్యం నేడు సమాజం లో జరుగుతున్న పరిణామాలే అని చెప్పవచ్చు .విద్య నేర్చుకొనే వయసులో పిల్లలు మనో బావాలు దెబ్బతినడం ,బావోద్యోగాలను అదుపులో పెట్టుకోలేక జీవితాన్ని నాశనం చేసుకోవడం ప్రతి రోజూ పేపర్లో చూస్తూనే ఉన్నాము.వారి ప్రవర్తన పెద్దల పాలిత శాపంగా పరిణమిస్తోంది .
సినిమాలు ,సేరియల్లు ,ఇంటర్నెట్ ప్రదానంగా విద్యార్ధుల జీవితాలను ప్రబావితం చేస్తున్నాయి .పేస్ బుక్ ని ఉపయోగించుకొని ఒక మరగుజ్జు మనిషి ఇక అమ్మాయిని ఎంత మోసం చేసాడో ఈమద్య్హ వెలుగులోకి వచ్చింది .దగ్గరి మనుష్యులు తోనే స్నేహం ప్రమాదకరంగా మారిన సమాజంలో ఎక్కడో వున్న వ్యక్తులతో ఆన్ లైన్ లో సంభా సించి ప్రేమించడం ఎంత మూర్కత్వం .
మన విద్యా వ్యవస్థ లో కనీసం నైతిక విలువలు పెంచే విలువలు సిలబుస్ లో చేర్చక పోవడం దారుణం.అంతే కాదు .తల్లి దండ్రులుకు విద్యర్థుల రోజు వారీ కార్యక్రమాలను తెలుసుకొని వారిని సక్రమ మార్గంలో పెట్టె తీరిక లేకుండా పోయింది . క్రమశిక్షణ ,నైతిక స్థైర్యం ,ఆరోగ్య కరమైన అలవాట్లను చెప్పే తల్లి దండ్రులు ,గురువులు నేడు కొరత అయిపోయారు .
ఈ సమస్యలు పరిష్కరించు కో కుంటే బావి సమాజం అంధకారంలో పడిపోతోంది.
తల్లి దండ్రులు ,మేధావులు,గురువులు ,రచయితలు ,కవులు ,సామాజిక వేత్తలు ,సినిమా డైరెక్టర్ లూ ,అందరూ భాద్యతతో వ్యవహ రించవలసిన సమయం ఆసన్న మైనది .జ్ఞానేంద్రియాల వికాసం ,పరిసరాల విజ్ఞానం ,నిర్దిష్ట నైపుణ్యం ,ఉపాది ,సామాజిక వికాస భాద్యత ,విశిష్ట వ్యక్తిత్వ నిర్మాణం,మార్గదర్శక సామర్ధ్యం పెంపు దలలె చదువుల పరమార్ధం కావాలి .
నిజమే అలాంటి చదువులు ఇప్పుడు వస్తే...చాలా మంది మళ్ళీ చదువుకోవలసి వస్తుందేమోనండి:-)
రిప్లయితొలగించండి