14, అక్టోబర్ 2012, ఆదివారం

ఆనంద సాగరం

ఆనంద సాగరం
నీ చూపుల కిరణాలు 
నను సోకినపుడు 
నా మనసు వికసించి 
ప్రేమతో నిను అల్లుకు పోతా !!

నీ వెచ్చని శ్వాస 
నా హృదయాన్ని తాకినపుడు 
నవ్వుల నెల రాజునై 
నీ పై  వెన్నెల కురిపిస్తా 

నీలో నేనై ,నాలో వీవై వున్నపుడు 
నీ భావాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే 
కాలాన్ని మరచి 
ఆనంద సాగరాలు దాటేస్తా !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

html enable