21, ఆగస్టు 2012, మంగళవారం

nyayam

న్యాయం 
ధర్మాన్ని రక్షించు
అది నిన్ను రక్షిస్తుంది
న్యాయాన్ని కాపాడు
అది నిన్ను కాపాడు తుంది
నీతి పై నిలబడు
అది నీకు ఊతమిస్తుంది
నిజాన్ని నిలబెట్టు
అది నిన్ను నిలబెడుతుంది

24, జులై 2012, మంగళవారం

prema

ప్రళయానికి పుట్టుక తెలియదు
ప్రణయానికి మరణం తెలియదు 
స్నేహానికి మరువడం తెలియదు 
ప్రేమకి కాలం విలువ తెలియదు !!!


18, మే 2012, శుక్రవారం

amma

అమ్మ 
రెండక్షరాల నిలువెత్తు దైవం అమ్మ 
మొదటి గురువు అమ్మ 
ప్రేమకు ప్రతిరూపం అమ్మ 
కష్టాల కడలిని దాటించేది అమ్మ
సుఖాల వీణ ను మీటేది అమ్మ 
కన్నా బిడ్డను ఆకాసంలో నిలిపి 
తను భూమిపై ఒడిగేది అమ్మ 

1, మార్చి 2012, గురువారం

song

పల్లవి ;ప్రియా ..నీ కోకిల కువకువలు 
          చెలీ ..నీ తలపుల తళతళ లు 
          ఇవే ...నా మనసుకు మధుపములు 
         ఇవే ..మన భవితకు శుభగములు            
చరణం ;వెతలేందుకే చెలియా వేణువై నేనుండగా 
            అరుదెంచ వే సఖియా ఆలివై తోడుండగా 
           గతమును మరచి బొంకును విడచి 
           రాధ లాగ రావే రాగామల్లె రావే                    //ప్రియా //
చరణం ;నన్నందుకో మగువా రాముడై నేనుండగా 
            సిగ్గెందుకే కలువా బతుకున విరబూయగా 
            సుగుణము తలచి వదనము వలచి 
            సీత లాగ రావే సిరిమల్లె నీవే                      //ప్రియా //

song

పల్లవి ;నా ఎదుట నీవుంటే నీ ఎదుట నేనుంటే 
          నా కళ్ళలో నీ రూపాలు 
          నీ కళ్ళలో నా భావాలు 
          కలకాలం ఇలాగే వుండాలి 
          చిరకాలం ఇలాగే సాగాలి 
చరణం ;ఉందామా కలిసుందామా
            వేదములో నాదములా 
            మేఘములో వర్శములా 
            నిదురలోన స్వప్నముగా 
            నీటిలోన రంగులుగా                                   //నా ఎదుట //
చరణం ;ఉందామా కలిసుందామా 
            తేనియలో తీపి అలగా
            శోభ లతలో పుష్పముగా 
           శ్వాశ లోన సోహముగా 
           మంత్రములో మాటలుగా                    //నా ఎదుట //

song

పల్లవి ;ప్రియతమా ప్రియతమా 
          ప్రియతమా పదిలమా 
         అందాలన్నీ పదిలమా .............
         పరువమా పరువమా 
         పరువమా కదులుమా
         బందాలన్నీ కదుపుమా.........
చరణం ;పారే సెలయేటిలో పొంగింది నీ వయసూ 
            పొంగే నీ వయసులో చేరింది నా మనసూ 
            దాగిన నా మనసులో కలిసింది నీ తలపు 
           వయసులు మనసులు తలపులు ఒకటై 
           వరమైనది బ్రతుకు .....                                             //ప్రియతమా //
చరణం ;చీరలో దాగిన సిగ్గుల మొగ్గావు నీవు .......
            మనసులో గమ్మత్తుగా మత్తును రేపే పూవువు నీవు 
            పూవులో నా రాగము వేణువులో వెదజల్లితినే
          మొగ్గలు పూవులు రాగాలుగా చిరుగాలైనది బ్రతుకే               //ప్రియతమా //

28, ఫిబ్రవరి 2012, మంగళవారం

comedy scene