17, సెప్టెంబర్ 2012, సోమవారం

jnapakam

చేజారిన జ్ఞాపకాలను
మనసులో నాటుకొని
వలపు నీటిని జల్లి
పెంచి పెద్ద చేస్తే
అందమైన నీ రూపం
కళ్ళ ముందు ప్రత్యక్ష మైనది
ప్రియా !
జన్మ జన్మ లకీ
నిన్ను నా మనసు నుండి
ఎవరూ చేరపలేరు !!!

9, సెప్టెంబర్ 2012, ఆదివారం

laali

ప్రేమ కు లాలి 
స్నేహానికి లాలి 
పాపకు లాలి 
ప్రియు రాలికి లాలి 
ముద్దుకు లాలి 
హద్దు కు లాలి 
వయసుకు లాలి 
మనసుకు లాలి 
పరవశా నికి లాలి 
ప్రకృతికి లాలి !!!

deniko mari

చిగురాకు తొడిగినా 
చిరు గాలి వీచినా 
అలలు తీరం దాటినా 
కలలు మదిన చేరినా 
ఒకటే ఆశ 
నువ్వొస్తావని 
కవ్విస్తావని !!1

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

raktham

రక్తం ధార బోస్తే
న్యాయం బైటకు వస్తుంది
ఊపిరి ధారబోస్తే
ధర్మం ఊపందు కొంటుంది ?!!
దైర్యం అడుగు ముందుకేస్తే
అసత్యం తోక ముడుచుకొంటుంది
వ్యక్తి లోనైనా
దేశపటము లో నైన
ఉడుకు రక్తం ప్రవహిస్తే
స్వాతంత్ర్యపు జెండా
రెప రెప లాడుతుంది 

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

love

ఒక పూవును ప్రేమించడం కన్నా
ఒక చెట్టును ప్రేమించడం మిన్న
ఒక నీటి బొట్టును ప్రేమించడం కన్నా
ఒక సముద్రాన్ని ప్రేమించడం మిన్న
ఒక జాతిని  ప్రేమించడం కన్నా
మానవత్వాన్ని ప్రేమించడం మిన్న
ఒక భూమిని ప్రేమించడం కన్నా
విశ్వాన్ని ప్రేమించడం మిన్న 

manasu

పల్లవి ;మనసు తడిసే మనువు తెలిపే
          వయసు ఎగసే  కలలు ఎగసే
         నా లోపల ....లోలోపల
చరణం ;చల చల్లగా నాలో
            మెలమెల్లగా నీవే
            ఏవో గుసగుసలు చేసావే
           ఎదలో గిలిగింతలు పెట్టవే                  ||మనసు ||
చరణం ;కనుచూపుల్లో నీవే
            పెళ్లి కూతురివై రావే
            ఏవో సయ్యాటలు ఆడావే
           వలపు చిగురులు రేపావే                   ||మనసు ||

3, సెప్టెంబర్ 2012, సోమవారం

kavikulam

దేవుని చేత
మనుషుల చేత
మోసగింప బడ్డ వాళ్ళం

కాలం చేత
గాలం చేత
గాయ పడ్డ వాళ్ళం

కాసేపు వాస్తవానికి దూరంగా
మరి కాసేపు
వర్తమానానికి దగ్గరగా
జీవించే వాళ్ళం

అవినీతికి ,అరాచకత్వానికి ఆవల
సంఘా లను నిర్మించు కొని
ఆనందించే వాళ్ళం

మేమంతా కవులం
సమాజ నిర్మాణానికి కారకులం .