30, అక్టోబర్ 2010, శనివారం

వెన్నెల రాతిరి

పల్లవి ; వెన్నెల రాతిరిలో నీ కోసం వెతికాను
కన్నుల వెలుతురులో నీ కోసం చూసాను
ఏ గాలి వీచెనో ఈ మనసు వేచేను
ఏ పైట తగిలేనో ఈ రేయి రగిలెను
నీ రూపమే నా ధ్యేయము
ఈ ప్రేమ నంధనములోనే తిరగాలి ........
చరణం ; హృదయాన్ని నడిపించే పరువాల వయసేది
బంధాన్ని పెనవేసే వయ్యారి వలపేది
కోకిల రాగమా నా భావం నేరమా
మమతల గానమా ఈ మదిని చేరుమా
కన్నుల గూటిలో ప్రతి నిత్యం స్వప్నం చిగురిస్తుంది
వయసు గోడులో అను నిత్యం నిన్నే తడుముతూ వుంది
ఈ విరహ భాద నీకే తెలుపాలి ........... వెన్నెల
చరణం ; మేఘాన విరిసేటి విరజాజి పూవేది
లోలోన విరిసేటి పున్నమి కలువేది
గుండె చాటు మొహమా తలపుల్లో తాపమా
ప్రేమ లోని పాసమా నా ఎదలోని కోశమా
పలుకు పలుకు ప్రతి రోజు బంధం పెనవేస్తుంది
పదము పదము ప్రతి నిమిషం అనుబంధం సృష్టిస్తుంది
ఈప్రేమపాటం నీకే వినిపించాలి ........... వెన్నెల

ఆశ

పల్లవి ;శ్వాసనై చేరనా నీ మనసులో
ఆశవై సాగవా నా వయసులో
మెరుపునై నిలవనా నీ సొగసులో
మమతవై మొలవవా నా కనులలో
చరణం ;నీ రూపము తలచినా
నా మనసులో మోహాలే
నీ భావము మెదిలినా
నా హృదిలో రాగాలే
ఏదో నిరీక్షణ నీ కోసమే
ఏదో ఆలాపన నీ భావమే శ్వాసనై
చరణం ;నీ మనసును వలచినా
నా బతుకున వెలుగులే
నీ ధ్యానము చేసినా
నాకు మోక్షము కలుగులే
ఏవో తపనలు నీకోసమే
ఏవో చిగురులు నీ ఆశలే శ్వాసనై

14, అక్టోబర్ 2010, గురువారం

పాట

పల్లవి ;కలియుగ దేవుడు వెంకయ్య కలి మాయ తొలగించు గురువయ్యా ....
చరణం ;ఈ క్షే త్రం ప్రతి నిత్యం రాజిల్లు శోబిల్లు
కలియుగంమున ..............
ఈ దైవం అనుదినం ఊరేగు ఊయలూగు
హృదయమ్మున ............ ||కలియుగ||
చరణం ;ఆనంద నిలయాన ముర్తియే
గొలగమూడి మూర్తి
కైలాస శిఖరాన కొలువున్న స్వామియే .........
ఈ ఈశ్వర శక్తి
విష్ణు నాభిన అవతరించిన వాడే
ఈ సృష్టి రూప శిల్పి
దత్తాత్రేయ రూపమే
ఈ వెంకయ్య మూర్తి ||కలియుగ ||

పాట

పల్లవి ;ఓం నారాయణ ఆది నారాయణ
ఓం నారాయణ శాంతి నారాయణ
చరణం ;ఇదియే మంత్రం ఇదియే గానం
ఈ ధ్యానం ఈ రాగం
కలిగించును మోక్షం ||ఓం ||
చరణం ;వైబోగం వైరాగ్యం (?) లేదిక స్వర్గమే
ఇక ఆనందం అమృతం
అదియే అమర లోకము
గొలగమూడి నీడలో
నిత్యమూ తాండవము...... ||ఓం||

11, అక్టోబర్ 2010, సోమవారం

పల్లవి :వెంకయ్య స్వామీ మా వెంకయ్య స్వామీ
మా భాధలన్నీ తీర్చవయ్య వెంకయ్య స్వామీ
అసలు గురువంటే నేవేలె వెంకయ్య స్వామీ
చరణం :నాగుల వెల్లటురులో పుట్టావంట
గొలగమూడి మందిరాన వేలిసావంట
అవనిలో వెలసిన అవధూత వంట
సాక్షాత్తు నారాయణుడువి నీవేనంట ||వెంకయ్య స్వామీ ||
చరణం :నీ మందిరాన కాలు మూపితే చాలునంట
సర్వ పాపాలు పటాపంచలై పోవునంట
ఒక్క సారి దర్శించిన చాలునంట
వారి భారమంతా నీవే మోసేవంట ||వెంకయ్య స్వామీ ||

10, అక్టోబర్ 2010, ఆదివారం

పాట:2
పల్లవి :
ఓం నారాయణ !ఆది నారాయణ !!
చరణం :పరిశుద్ధ ఆత్మ తేజా !విరిసిన వైకుంఠ నాదా !!
అన్నదాతా ,ఆపద్బాన్ధవా
సర్వ వ్యాపకా సర్వేశ్వరా !!
సమాధి స్థితిలో మంత్రోపదేశం
ధ్యాన సాగరంలో గురువుల దర్శనం
సహస్రారమున కొలువైన వైనం || ఓం నారాయణ ||
చరణం :వేదాలను విడమరచి చెప్పిన వైనం
రహస్యాలను భోధించిన శంఖం
ఆధ్యాత్మిక ప్రయాణంలో తోడైన చక్రం
నీవే గురుదేవా !
నీవీ విశ్వరూపా !! ||ఓం నారాయణ ||
పల్లవి :పదము పలకరా స్వామి పదము పలకరా
ముక్తికదే మూలమురా భక్తి కదే మార్గామురా
చరణం :కస్టాలు కలిగాయని స్వామిని నిందిచకురా
నష్టాలు వచ్చాయని స్వామిని ద్వేషించాకురా
అవి నీ ప్రారబ్ధమురా గత జన్మ పాప కర్మరా || పదము పలకరా ||
చరణం :సుఖాలు కలిగాయని స్వామిని మరువకురా
భోగాలు వెలిసాయని స్వామిని విడువకురా
అది నీ పుణ్య పలమురా గత జన్మ దైవీ సంపధరా ||పదము పలకరా ||
చరణం :రాగ ద్వేషాలను విడువుమురా కోరికలను త్యజించుమురా
గురువును సేవించరా దేవుని పూజించారా
పాప కర్మ తోలగునురా సుఖ జీవన యానం నీదేరా |పదము పలకరా ||

24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

గగన సౌందర్యం

విశ్వ నేత్రం విచ్చుకున్నప్పుడు
పచ్చదనం కప్పుకున్న నేల
పరిమళాలు వెదజల్లుతూ
నాట్యం చేస్తుంది
ఆకాశాన్ని దాచుకున్న సాగరగర్భం
నీలపు అద్దమై మెరుస్తుంటుంది
ఇంద్ర దనువుపై
నిలచిన జల బిందువులు
గగన సౌందర్యాన్ని ఆవిస్కరిస్తుంటాయి
ప్రకృతి ధరించిన
మంచు కిరణాలను తొలగిస్తూ
నేలను ఆక్రమించే ఎండ
ఆకాశం విసిరేసిన సుందర దృశ్యాన్ని
రెప్పల వాకిళ్ళు మూసి
కనులలో దాచుకోవాలే గాని
నూరేళ్ళ జీవితం ఆనందాన్ని
పులుముకోదూ ?!

ఉమ్మడిరాగాలు

వసంతాల నీడలో
వలపుల పూలు పరచి
చల్లగాలిని పిలచి
జ్ఞాపకాల పుటలను
తిరగేస్తుంటే .....
ప్రియా!
ఆనాడు నీ మోమును చూసి
జాబిలి చిన్నబోయింది
నీ నవ్వును చూసి
వెన్నెల మూగబోయింది
కాలంలో విరబూసిన
మన సజీవ కొనాల మధ్య
అధిరోహించిన
సమున్నత శిఖ రాల పైన
ఉమ్మడి రాగాలు ఆలపిద్దాం .

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

వెన్నల సఖి

ఎన్ని కడలి సాయంత్రాలు
ఎన్ని గగన విహారాలు
మనిద్దరి మధ్యా
ఓ వెన్నల సఖి !
నీ చూపుల తీగలు
నా శూన్య నేత్రాలలో
ఇంద్ర ధనుస్సులా
ఆవిష్కరించ బడినపుడు
ఆ క్షణాలు మౌ నాన్ని పులుము కొని
వెన్నల జ్ఞాపకాల మధ్య
మన ప్రతిబింబాలను చిత్రీకరిస్తాయి
కడలి తీరపు ఇసుక తిన్నెలపై
విహరించిన మన పాద ముద్రలలో
సప్తవర్ణ పుష్పాలే
కాంతులీను తుంటాయి .

19, సెప్టెంబర్ 2010, ఆదివారం

premageetham

ప్రేమగీతం

ప్రియసఖి !

నీ సజీవ శిల్ప సౌందర్య వర్ణాలలో

నేను ఇంద్రధనుస్సునై ప్రవేశించి

ఆశాజ్యోతి నిరంతరం ప్రజ్వరిల్లడానికి

మధుర స్వప్న తైలబిందువులుగా మారి

హృదయ జ్వాలతో

నీ మనసును వెలిగిస్తా

22, ఏప్రిల్ 2010, గురువారం

Mouna Veena