మేఘ మందిరం
stories,essays,poems and songs
24, జులై 2012, మంగళవారం
prema
ప్రళయానికి పుట్టుక తెలియదు
ప్రణయానికి మరణం తెలియదు
స్నేహానికి మరువడం తెలియదు
ప్రేమకి కాలం విలువ తెలియదు !!!
18, మే 2012, శుక్రవారం
amma
అమ్మ
రెండక్షరాల నిలువెత్తు దైవం అమ్మ
మొదటి గురువు అమ్మ
ప్రేమకు ప్రతిరూపం అమ్మ
కష్టాల కడలిని దాటించేది అమ్మ
సుఖాల వీణ ను మీటేది అమ్మ
కన్నా బిడ్డను ఆకాసంలో నిలిపి
తను భూమిపై ఒడిగేది అమ్మ
1, మార్చి 2012, గురువారం
song
పల్లవి ;ప్రియా ..నీ కోకిల కువకువలు
చెలీ ..నీ తలపుల తళతళ లు
ఇవే ...నా మనసుకు మధుపములు
ఇవే ..మన భవితకు శుభగములు
చరణం ;వెతలేందుకే చెలియా వేణువై నేనుండగా
అరుదెంచ వే సఖియా ఆలివై తోడుండగా
గతమును మరచి బొంకును విడచి
రాధ లాగ రావే రాగామల్లె రావే //ప్రియా //
చరణం ;నన్నందుకో మగువా రాముడై నేనుండగా
సిగ్గెందుకే కలువా బతుకున విరబూయగా
సుగుణము తలచి వదనము వలచి
సీత లాగ రావే సిరిమల్లె నీవే //ప్రియా //
song
పల్లవి ;నా ఎదుట నీవుంటే నీ ఎదుట నేనుంటే
నా కళ్ళలో నీ రూపాలు
నీ కళ్ళలో నా భావాలు
కలకాలం ఇలాగే వుండాలి
చిరకాలం ఇలాగే సాగాలి
చరణం ;ఉందామా కలిసుందామా
వేదములో నాదములా
మేఘములో వర్శములా
నిదురలోన స్వప్నముగా
నీటిలోన రంగులుగా //నా ఎదుట //
చరణం ;ఉందామా కలిసుందామా
తేనియలో తీపి అలగా
శోభ లతలో పుష్పముగా
శ్వాశ లోన సోహముగా
మంత్రములో మాటలుగా //నా ఎదుట //
song
పల్లవి ;ప్రియతమా ప్రియతమా
ప్రియతమా పదిలమా
అందాలన్నీ పదిలమా .............
పరువమా పరువమా
పరువమా కదులుమా
బందాలన్నీ కదుపుమా.........
చరణం ;పారే సెలయేటిలో పొంగింది నీ వయసూ
పొంగే నీ వయసులో చేరింది నా మనసూ
దాగిన నా మనసులో కలిసింది నీ తలపు
వయసులు మనసులు తలపులు ఒకటై
వరమైనది బ్రతుకు ..... //ప్రియతమా //
చరణం ;చీరలో దాగిన సిగ్గుల మొగ్గావు నీవు .......
మనసులో గమ్మత్తుగా మత్తును రేపే పూవువు నీవు
పూవులో నా రాగము వేణువులో వెదజల్లితినే
మొగ్గలు పూవులు రాగాలుగా చిరుగాలైనది బ్రతుకే //ప్రియతమా //
28, ఫిబ్రవరి 2012, మంగళవారం
comedy scene
comedy scene
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)