మేఘ మందిరం
stories,essays,poems and songs
6, సెప్టెంబర్ 2013, శుక్రవారం
12, ఫిబ్రవరి 2013, మంగళవారం
see my poem
see my poem in andhra bhoomi weekly ,name as PREMA GEETHALU in this week
pallapu ramu
nellore
pallapu ramu
16, జనవరి 2013, బుధవారం
అనైతికం కథ
అనైతికం కథ
నెల్లూరు రైల్వే స్టేషన్ .రాత్రి పది గంటలు .సంజయ్ ఒకటవ నంబర్ ప్లాట్ ఫారం చివర బెంచీ మీద కూర్చొని ఉన్నాడు .వస్తూ పోతూ ఉన్న రైళ్ళను చూస్తూ ఉన్నాడు .అక్కడ జన సంచారం కూడా తక్కువే .తన ఆలోచనలన్నీ రేపు జరగబోయే ఇంటర్వ్యు మీదే సాగుతున్నాయి ఇంటర్వ్యూ లో సక్సస్ అయ్యి ఉద్యోగం పొందాలంటే రెండు లక్షలు కావాలి .కనీ అంత డబ్బు తన దగ్గర లేదు .
ఎలా ?
నిరుత్సాహంతో శున్యం లోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు.
ఇంతలో పక్కన అలికిడైనది .తల తిప్పి చూశాడు .అందమైన అమ్మాయి నవ్వుతూ పక్కన కూర్చుంది .
తనూ నవ్వబోయాడు .కానీ ఆమె ఎవరో తెలీదు .
ఆమె కన్ను మీటుతూ "వస్తావా?ఐదు వేలు ."అంది
సంజయ్ కి ఏమీ అర్ధం కాలేదు .మొహం అదోలా పెట్టి "ఇదు వేలేమిటి ?"అన్నాడు
"ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నావే ?!ఇదు వేలిస్తే ఈ రాత్రికి నీ సొంత మౌతాను ."అంది నవ్వుతూ
అతడు తల పట్టు కున్నాడు ."అ య్యో !భలేవారండి .నేను అటువంటి వాడిని కాదు ."అన్నాడు అసహనంగా
"చూడ్డానికి అమాయకుడిలా కన్పిస్తున్నావు .కనీసం రెండు వే లైనా చూడు .నీ వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను 'అంది రెచ్చ గోడుతున్నట్టు /
అసలే మనసు బాగా లేదు .ఈ అమ్మాయి ఇబ్బంది పెడుతోంది .ఎలాగైనా ఈ మె బారి నుండి తప్పించుకోవాలి అనుకున్నాడు
"మీ పేరేమిటి ?"ప్రశ్నించాడు .
" సౌమ్య "
"వెరి నైస్ నేమ్ .అంతే కాదు మీరు చాలా అందంగా ఉన్నారు "అన్నాడు పోగుడుతున్నట్లు .
ఈ అందమే నన్నీ స్థితికి తీసుకొని వచ్చింది ."అందామె భాదగా
ఈసారి ఆమె గొంతు బొంగురు పోయింది ..ట్యూబ్ లైట్ కాంతి లో అతడు గమనించ లేదు కానీ ఆమె కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగాయి .
సంజయ్ మనసు చివుక్కు మంది .'మిమ్మలను అనవసరంగా భాద పెట్టి నట్లు ఉన్నాను .అ యాం వెరీ సారీ ."అన్నాడు నోచ్చుకోలుగా
"పర్వా లేదు .అసలు విషయం చెప్పండి ?మనకి బేరం కుదరనే లేదు .మీరెంత చెబితే అంత "అంది ఒక నిర్ణయానికి వచ్చినట్లు
అతడు వేదాంతిలా నవ్వాడు ."సౌమ్య గారూ !రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది .ఒక ప్రైవేటు కంపనీలో ఉద్యోగం .దానికి రెండు లక్షలు లంచం అడుగుతున్నారు స్నేహితుల్ని ,భండువుల్ని అందరినీ అడిగాను .ఎవరూ నన్ను నమ్మి ఇవ్వలేదు .ఏమి చేయను .పేద వాడిని ."అని ఆగి "మా ఇల్లు పక్కనే రంగ నాయకుల పేటలో .మనసేమీ భాగాలేదు .అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను "అన్నాడు విషాదంగా .
ఆమే మౌనం వహించింది .కాసేపు తర్వాత "..........అయితే మీకు రెండు లక్షలు కావాలన్న మాట ."అంది స్థిరంగా
అతడు నవ్వి "అవును ఇవ్వగలవా ?"అన్నాడు తమాషా పడుతున్నట్టు
" తప్పకుండా ఇస్తాను ."అందామె
అతడు ఆశ్చర్యంగా "వ్వాట్ ?ఏమిటి మీరనేది ?మీరెవరో నాకు తెలీదు .నే నెవరో మీకు తెలీదు .అంత డబ్బు ఎలా ఇస్తారు ?"అని సందేహంగా ప్రశ్నించాడు
"చూడండి .మనిషికి మానవత్వం ముఖ్యం .తోటి మనిషి కష్టాలలో ఉన్నపుడు ఆదు కోవడానికి బందుత్వాలూ ,స్నేహాలూ అవసరం లేదు .మానవత్వం చాలు "అని ఆగి "నేను కూడా జీవితంలో చాలా చదవాలను కున్నాను .ఉన్నత స్థితికి రావాలనుకున్నాను .మాది కూడా నిరు పేద కుటుంబం .చిన్న వయసులోనే నాకు పెళ్లి చేసారు .నా భర్త తాగు భోతు .సినిమాల పిచ్చి .ప్రతి రోజూ నేను డబ్బు సంపాదించి అతడికి ఇవ్వాలి .లేకపోతే తిడతాడు .కొడతాడు .రక రకాలుగా హింసిస్తాడు .అది నా గతం.నేనిచ్చే డబ్బుతో నీ జీవితం భాగు పడుతుందనుకొంటే నాకంత కంటే సంతోషం లేదు .తీసుకో ..."అంటూ చేతికి ఉన్న బంగారు గాజులను ,మేడలో గొలుసును తీసి అతని చేతిలో పెట్టింది .
సంజయ్ కి ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు .ఇది కలా ?నిజమా ?ఈ కాలంలో కూడా ఇటువంటి మనుషులు ఉన్నారా అని విస్తుబోయాడు .ఆమె ఒన్నత్యం ముందు తల వంచి నిలబడ్డాడు
****** ******** ********
ఒక సంవత్సరం గడిచింది .
సంజయ్ ఇప్పుడు ఉద్యోగి .నెలకి ముప్పది వేలు జీతం .అంతే కాదు .కంపెనీ కారు ,క్వార్టర్స్ అన్ని వసతులు కల్పించింది .తానిప్పుడు సమాజంలో ఉన్నత వ్యక్తి .
అన్నిటికీ కారణం సౌమ్య !!
అవును ముమ్మాటికీ కారణం సౌమ్యే !!తానిప్పుడు ఎక్కడ ఉందొ తెలీదు .రెండు సార్లు చూడ్డానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు .ఆమె కన్పించలేదు .ఆమె సెల్ కి నాలుగైదు సార్లు ఫోన్ కుడా చేసాడు.ఎప్పుడు చేసినా మగ గొంతే మాట్లాడుతోంది .బహుశా ఆమె భర్త అయ్యి ఉండ వచ్చు.!
అయితే యాద్రుచికంగా ఆమె ఓసారి కన్పించింది .మాట్లాడాలనుకున్నాడు.వీలు కాలేదు .కారణం ఆమె శవంగా రోడ్డు పక్కన పడి ఉంది .
శవం చుట్టూ జనం మూగి ఉన్నారు.
"ఎవరో పాపం .రెండు రోజుల నుండి ఇక్కడే పడి ఉంది ."అన్నారెవరో
"అవును .ఆమెకు ఎయిడ్స్ అట .ఇంట్లో మొగుడు తరిమేసాడట .దిక్కు లేకుండా చనిపోయింది "అంటున్నారింకొకరు
సంజయ్ కి ఏమీ విన్పించడం లేదు .ఆమె శవం వైపే చూస్తుండి పోయాడు ."ఆమె తనకు తెలుసు "అని అక్కడ అందరికీ చెప్పాలను కున్నాడు .
కానీ ,సమాజంలో తన పేరూ .ప్రతిష్ట .హోదా అన్నీ అడ్దోచ్చాయి .తిన్నగా అక్కడ నుండి కదిలాడు .వచ్చి తన కారులో కూర్చున్నాడు .జేబు లోంచి సెల్ తీసి ఫోన్ చేయడం ప్రారంబించాడు .
ఆమె భర్తకి కాదు .
మున్సిపాలిటీ వాళ్లకి !!!
****** ******** ********
2011సంవత్సరం నెల్లూరు సాహితీ మిత్రులు నిర్వహించిన రాష్ట్ర స్థాయి కథల పోటీలో కన్సొలే షన్ బహుమతి పొందిన కథ .
5, జనవరి 2013, శనివారం
telugu
తెలుగు భాష నొదలి తల్లడిల్లుచు నేడు
మమ్మి డాడి అనుచు మోసపో యె
పద్య మంటె మనసు పరుగులు తీయునే
ఆంగ్ల భాష లోన సొగ సేల ?
తెలుగు భాష నొదలి తల్లడిల్లుచు నేడు
మమ్మి డాడి అనుచు మోసపో యె
పద్య మంటె మనసు పరుగులు తీయునే
ఆంగ్ల భాష లోన సొగ సేల ?
అచ్చులోన అంత మగుచూ అలరారు
సరిగమలకు తెలుగు సాధ్యమగును
ఆంగ్ల భాష నొదలు ఆంధ్రుడవే నీవు
తెలుగు పదము తేనెలూరు
మిన్ను విరిగి పడ్డ మనకేల పరభాష ?
తెలుగు లోన కలదె తేటగీతి
ఏమి మంచి చేసే ఎందుకు ఆంగ్లము ?
అమ్మ భాష కుంది ఆటవెలది
పల్లపు రాము
ఉపాధ్యాయుడు
నెల్లూరు
![]() |
ప్రత్యుత్తరం లేదా ఫార్వర్డ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
|
అచ్చులోన అంత మగుచూ అలరారు
సరిగమలకు తెలుగు సాధ్యమగును
ఆంగ్ల భాష నొదలు ఆంధ్రుడవే నీవు
తెలుగు పదము తేనెలూరు
మిన్ను విరిగి పడ్డ మనకేల పరభాష ?
తెలుగు లోన కలదె తేటగీతి
ఏమి మంచి చేసే ఎందుకు ఆంగ్లము ?
అమ్మ భాష కుంది ఆటవెలది
పల్లపు రాము
ఉపాధ్యాయుడు
నెల్లూరు
![]() |
ప్రత్యుత్తరం లేదా ఫార్వర్డ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
|
30, డిసెంబర్ 2012, ఆదివారం
పద్యాలు
![]() ![]()
తెలుగు తల్లి పద్యాలు
ఇన్బాక్స్
x | ![]()
ఆ .వె\\ తెలుగు భాష నొదలి తల్లడిల్లుచు నేడు
మమ్మి డాడి అనుచు మోసపో యె
పద్య మంటె మనసు పరుగులు తీయునే
ఆంగ్ల భాష లోన సొగ సేల ?
ఆ.వె \\ అచ్చులోన అంత మగుచూ అలరారు
సరిగమలకు తెలుగు సాధ్యమగును
ఆంగ్ల భాష నొదలు ఆంధ్రుడవే నీవు
తెలుగు పదము తేనెలూరు
ఆ .వె \\ మిన్ను విరిగి పడ్డ మనకేల పరభాష ?
తెలుగు లోన కలదె తేటగీతి
ఏమి మంచి చేసే ఎందుకు ఆంగ్లము ?
అమ్మ భాష కుంది ఆటవెలది
పల్లపు రాము
ఉపాధ్యాయుడు
నెల్లూరు
|
8, డిసెంబర్ 2012, శనివారం
కథ
కథ
ఇక ఊరిలో ఒక రాజు ఉండే వాడు .అతనికి ముగ్గురు కుమారులు .రావన్ ,ఆల్బర్ట్ ,పీటర్ వారి పేర్లు.ఒక రోజు ముగ్గురు పిల్లలు ఆడు కొంటున్నారు.రాత్రయింది.చలి మంట వేసుకొన్నారు.మంట రావన్ కి అంటూ కొండి.రావన్ పెద్దగా కేకలు పెడుతున్నాడు.మిగిలిన ఇద్దరు పరుగెత్తుకొని వెళ్లి రాజు కి చెప్పారు.
రాజు హుటాహుటిన అక్కడకు చేరు కొన్నాడు .అప్పటికే రావన్ సగం కాలి పోయాడు.రాజు తనతో ఉన్న దుప్పట్లును రావన్ కు కప్పాడు.తర్వాత వైద్యుని దగ్గరకు పంపించాడు.రావన్ కు రెండు కళ్ళు పోయాయి.కానీ ప్రాణం దక్కింది.
తన బిడ్డకు కళ్ళు తెప్పించిన వారికి రాజు సగం రాజ్యాన్ని ఇస్తానని ప్రకటించాడు .ఏ వైద్యుడు నయం చేయలేక పోయాడు .కానీ మంత్రి ఒక సలహా ఇచ్చాడు .కాకులు దూరని కారడవి ,చీమలు దూరని చిట్టడవి లో ఒక మూలిక దొరుకు తుందని ,అది తెచ్చి,దాని రసం కళ్ళకు పూసిన చూపు వస్తుందని చెప్పాడు.
దీనికి ఎవరూ ముందుకు రాలేదు.చివరికి రాజు అడవికి వెళ్ళాడు .మూలికను సంపాదించాడు .తఃన బిడ్డకు చూపు ను ప్రసాదించాడు.
పల్లపు కృష్ణ వంశి
5 వ తరగతి
సెయింట్ పాల్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్
పద్మా వతి సెంటర్
నెల్లూరు -4
ఇక ఊరిలో ఒక రాజు ఉండే వాడు .అతనికి ముగ్గురు కుమారులు .రావన్ ,ఆల్బర్ట్ ,పీటర్ వారి పేర్లు.ఒక రోజు ముగ్గురు పిల్లలు ఆడు కొంటున్నారు.రాత్రయింది.చలి మంట వేసుకొన్నారు.మంట రావన్ కి అంటూ కొండి.రావన్ పెద్దగా కేకలు పెడుతున్నాడు.మిగిలిన ఇద్దరు పరుగెత్తుకొని వెళ్లి రాజు కి చెప్పారు.
రాజు హుటాహుటిన అక్కడకు చేరు కొన్నాడు .అప్పటికే రావన్ సగం కాలి పోయాడు.రాజు తనతో ఉన్న దుప్పట్లును రావన్ కు కప్పాడు.తర్వాత వైద్యుని దగ్గరకు పంపించాడు.రావన్ కు రెండు కళ్ళు పోయాయి.కానీ ప్రాణం దక్కింది.
తన బిడ్డకు కళ్ళు తెప్పించిన వారికి రాజు సగం రాజ్యాన్ని ఇస్తానని ప్రకటించాడు .ఏ వైద్యుడు నయం చేయలేక పోయాడు .కానీ మంత్రి ఒక సలహా ఇచ్చాడు .కాకులు దూరని కారడవి ,చీమలు దూరని చిట్టడవి లో ఒక మూలిక దొరుకు తుందని ,అది తెచ్చి,దాని రసం కళ్ళకు పూసిన చూపు వస్తుందని చెప్పాడు.
దీనికి ఎవరూ ముందుకు రాలేదు.చివరికి రాజు అడవికి వెళ్ళాడు .మూలికను సంపాదించాడు .తఃన బిడ్డకు చూపు ను ప్రసాదించాడు.
పల్లపు కృష్ణ వంశి
5 వ తరగతి
సెయింట్ పాల్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్
పద్మా వతి సెంటర్
నెల్లూరు -4
24, నవంబర్ 2012, శనివారం
మనసు పరిమళం
మనసు పరిమళం
మనసులో అంధకారం
బ్రతుకుకి అవరోధం
మనో వైకల్యం -మనిషికి ఒక దౌర్భాల్యం
చిట్టి మనసు గాయ పడితే
పెద్ద తనువు తల్లదిల్లిపోదూ ...
ఈర్ష్య ,ద్వేషం ,అసూయ ,హింస ....
దుర్గుణా లతో ఆవరించిన మనసు
కష్టాల పాలై క్షీణిస్తుంది
సత్యం ,ధర్మం ,త్యాగం ,సహనం ......
సద్గుణా లతో ఆవరించిన మనసు
సుఖ శాంతులతో శోబిస్తుంది
అందుకే ఓ మనిషీ !!
ఆత్మ విశ్వాసమనిడి ఖడ్గం చేత పట్టు
అరి శద్వార్గాల ను తెగ నరుకు
ఇంద్రియాలనేడి అశ్వాల తాళ్ళను చేత పట్టు
భుద్ది యనెడి రధాన్ని ముందుకు నడిపించు
అపుడే
విజయం నీ కాళ్ళ ముందు వాలుతుంది
మనో వైకల్యం ఆమడ దూరం పరుగెడు తుంది
నీ మనసుకు పరిమళం అద్దు కొని
విజయం వైపు నువ్వు నడువ్
నీ వెనక ప్రపంచం నడుస్తుంది !!
మనసులో అంధకారం
బ్రతుకుకి అవరోధం
మనో వైకల్యం -మనిషికి ఒక దౌర్భాల్యం
చిట్టి మనసు గాయ పడితే
పెద్ద తనువు తల్లదిల్లిపోదూ ...
ఈర్ష్య ,ద్వేషం ,అసూయ ,హింస ....
దుర్గుణా లతో ఆవరించిన మనసు
కష్టాల పాలై క్షీణిస్తుంది
సత్యం ,ధర్మం ,త్యాగం ,సహనం ......
సద్గుణా లతో ఆవరించిన మనసు
సుఖ శాంతులతో శోబిస్తుంది
అందుకే ఓ మనిషీ !!
ఆత్మ విశ్వాసమనిడి ఖడ్గం చేత పట్టు
అరి శద్వార్గాల ను తెగ నరుకు
ఇంద్రియాలనేడి అశ్వాల తాళ్ళను చేత పట్టు
భుద్ది యనెడి రధాన్ని ముందుకు నడిపించు
అపుడే
విజయం నీ కాళ్ళ ముందు వాలుతుంది
మనో వైకల్యం ఆమడ దూరం పరుగెడు తుంది
నీ మనసుకు పరిమళం అద్దు కొని
విజయం వైపు నువ్వు నడువ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)